నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను తెరకెక్కించిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు సైతం రాబట్టింది.


చాలా రోజుల తర్వాత బాలయ్యకు మంచి విజయం దక్కడంతో ఆయన ఆనందంగా ఉన్నారు. సూపర్ హిట్ అందుకున్న ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా  మొదలు పెట్టారు..


యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమా షూటింగ్ కూడా మొదలు అయ్యింది. గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో మంచి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండ బోతుందా అని అంతా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రెసెంట్ హైదరాబాద్ సమీపంలో షూటింగ్ చేస్తున్నారట.


ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గోపీచంద్ శరవేగంగానే షూటింగ్ చేస్తున్నారు..ఈ నేపథ్యంలో ఈ సినిమా నుండి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి విదితమే.. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మరొక హాట్ బ్యూటీ ని కూడా యాడ్ చేయాలనీ వారు చూస్తున్నారు.. ఈ సినిమాలో ఒక అదిరిపోయే ఐటెం నెంబర్ కూడా ఉండనుందట.


మాస్ పాటకు స్టెప్పులు వేయడానికి డింపుల్ హయతి ని అనుకుంటున్నారని తెలుస్తుంది.. అయితే ఈమె మాత్రం అందుకు ఆసక్తి అస్సలు చూపడం లేదట. అసలు బాలయ్యనే ఈమె పేరును గోపీచంద్ కు సజెస్ట్ చేశారని . అయితే ఈమె ఐటెం సాంగ్స్ చేయడానికి మాత్రం రెడీగా లేదట. మంచి పాత్రలు అయితేనే చేస్తా అని ఐటెం సాంగ్స్ అయితే చేయను అని కూడా చెప్పుకొచ్చింది. దీంతో గోపీచంద్ నిరుత్సాహ పడి వేరే హీరోయిన్ కోసం సర్చింగ్ లో ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: