బండ్ల గణేష్  గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన మనందరికి తెలుసు... ఎలా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా...అయితే తాజాగా ఈయన మరో సారి తనలోని ఫైర్ అంతా బయటకు తీశాడు.ఇకపోతే పూరీ జగన్నాథ్ పై కూల్ గా మాట్లాడుతూనే ఫైర్ అయ్యారు.. అన్నా అనుకుంటూనే హితబోద చేశారు.అయితే స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరీ హీరోగా.. జార్జిరెడ్డి ఫేమ్ సంజీవ్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా చోర్ బజార్. ఇక ఈమూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కాగా ఈ వెంట్ లో హాట్ టాపిక్ గా మారారు బండ్ల గణేష్. పోతే ఈ మధ్య కామ్ గా ఉన్న బండ్ల.. మరోసారి రెచ్చిపోయారు..ఇకపోతే ఈవెంట్ లో మాట్లాడుతూ.. 

పూరీ జగన్నాథ్ పై కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు బండ్ల.కాగా  ఎవరెవరినో స్టార్లను చేశావ్, డైలాగ్స్ రాని వారిని హీరోలుగా పెద్ద స్థాయిలో నిలుచోపెట్టావ్.. ఇక నీ కొడుకు విషయంలో మాత్రం ఇలా చేస్తున్నావ్.. నీ కొడుకు ఈవెంట్ కు కూడా రాకుండా ముంబయ్ లో కూర్చున్నావ్ అంటూ బండ్ల చురకలంటించారు.ఇక వ్యాంప్ లు వస్తుంటాయి పోతుంటాయి.. కాని కుంటుంబం శాశ్వతం, నేను బ్రతికేది నా కుటుంబ కోసం, నా కొడుకుల కోసం, నా కోసం.అయితే  మనం ఏం చేసినా.. బిడ్డల కోసమే.. రేపు మనకు తలకొరికి పెట్టేది వాళ్లే.. మనం ఆస్తులు సంపాదించినా.. వాళ్ళ కోసమే.. అప్పులు చేసినా తీర్చేది వాళ్లే.. అన్నా అంటూ పూరీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్.పోతే ఆకాశ్ పూరీ లో ఓ స్టార్ ఉన్నాడు. యాక్టింగ్ ఇరగదీస్తాడు. అయితే ఎవరినో స్టార్లను చేస్తున్నావ్..

నీ కొడుకుని మాత్రం పట్టించుకోవడంలేదు.అంతేకాకుండా  చూస్తూ ఉండు.. నీ కొడుకు కోసం కథ రాసి.. వాడి డేట్ల కోసం నువ్వ క్యూలో నిల్చుునే రోజు వస్తుంది అంటూ పూరీ జగన్నాథ్ ను ఉద్ద్యేశించి మాట్లాడారు బండ్ల గణేష్.దేనితో పాటు పూరీ భార్య గురించి మాట్లాడుతూ.. నేను సీతను చూడలేదు.. కాని ఆమెకు ఉన్నంత ఓపిక, సహనం ఉన్నాయి వదినమ్మలో.అంతేకాదు ఆమె ఎంత మంచి మనిషో నాకు తెలుసు.. పోతే పూరీ స్టార్ డైరెక్టర్ అయ్యాక అతన్ని పెళ్ళి చేసుకోలేదు ఆమె.. పూరీ జేబుల్ 100 రూపాయలు కూడా లేని రోజుల్లో.. ప్రేమించాడని.. వెంటవచ్చేసింది..ఇకపోతే  గుళ్ళో మూడు ముళ్లు వేసుకుని స్కూటర్ మీద తిరిగారువారు.. అంటూ గతాన్ని గుర్తు చేశారు బడ్ల.చివరిగా ఈ సినిమా డైరెక్టర్ పెద్ద మేధావి, ఆయనతో మాట్లాడుతుంటే నాకుభయమేసింది.. సినిమాను అద్భుతంగా తీశారు అంటూ డైరెక్టర్ ను ఉద్దేశించి మాట్లాడారు బండ్ల..!!

మరింత సమాచారం తెలుసుకోండి: