డైరెక్టర్ రాజమౌళి ఎంతో భారీ స్థాయిలో తెరకెక్కించిన మల్టీస్టారర్ చిత్రం rrr ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించారు. అయితే ఎన్నో సార్లు వాయిదా పడుతూ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ తో మారిపోయింది. దాదాపుగా ఈ సినిమా రూ.1150 కోట్ల రూపాయల మేరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఓటీటీ లో కూడా ఈ చిత్రం బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరు పైన ఇతర భాషలలోని డైరెక్టర్లు నటీనటులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ తన 30 వ సినిమాని తన పుట్టిన రోజున డైరెక్టర్ కొరటాల శివతో మొదలుపెట్టాడు అందుకు సంబంధించి ఒక డైలాగ్ మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ కలసి నిర్వహించడం జరుగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.


సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా ప్రకటించిన తర్వాత ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని ప్రచారం జరిగింది కానీ ఆమె వివాహం చేసుకోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది కానీ ఆమె స్థానంలో జాన్వీ కపూర్ ,శ్రద్ధా కపూర్ తదితర హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా ఉప్పెన సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న కృతి శెట్టి తోపాటు, పెళ్లి సందD హీరోయిన్ శ్రిలిలా నటించబోతున్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి మరి ఇద్దరు హీరోయిన్లు తెలుగులో వారుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: