ఇక ఇపుడేమో తాజాగా ఈ హీరో నుండి వచ్చిన 'సమ్మతమే' సినిమా కూడా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ ఈ యంగ్ హీరో చేతిలో ఇంకా బడా నిర్మాతల ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. అయితే అవి హిట్ అయితే కిరణ్ అబ్బవరం హీరో రేంజ్ వేరే లెవల్ లో ఉంటుంది. లేదంటే కెరియర్ గాడి తప్పే ప్రమాదం ఉందని అంటున్నారు.
కిరణ్ అబ్బవరం నుండి రాబోయే తదుపరి చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’. ఆ తర్వాత వరుసలో గీతా ఆర్ట్స్ తీస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఉంది. దీని తరవాత మైత్రీ మూవీ మేకర్స్, ఏఎం రత్నం సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.
కానీ చాలా మంది యంగ్ హీరోలలాగే ఇతని భవిష్యత్తు కూడా ఏమవుతుంది అని అంతా కంగారు పడుతున్నారు. మొదటి రెండు మూడు సినిమాలు హిట్ అవ్వడం.. ఆ తరువాత వరుస ప్లాప్ లతో కనుమరుగైపోయిన హీరోలు చాలా మందే ఉన్నారు. మరి మన కుర్రాడు కిరణ్ అబ్బవరం పరిస్థితి ఏమవుతుందో తెలియాల్సి ఉంది.