యస్ యస్ రాజమౌళి ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో 'ఆర్ఆర్ఆర్' (RRR)ను తెరకెక్కించిన విషయం తెలిపిందే. ఇక ఈ చిత్రం కూడా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా 1100 కోట్లకు పైగా రాబట్టి ప్రపంచ వ్యాప్తంగా హయ్యేస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్స్ లో గా నాల్గో స్థానాన్ని దక్కించుకుంది.ఇక 'బాహుబలి' రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇలా 'స్టూడెంట్ నెంబర్ వన్' నుంచి 'ఆర్ఆర్ఆర్' వరకు కూడా ఆయన క్రియేట్ చేసిన రికార్డులను ఆయనే బ్రేక్ చేస్తూ ఇండియన్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్తున్నాడు.ఆర్ఆర్ఆర్ సినిమా ఛాప్టర్ ముగియడంతో రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్ బాబు  కాంబినేషనల్ లో రూపుదిద్దుకోనున్న మెగా ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఆ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి.


ఇక ఈ క్రమంలో తాజాగా ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'పై కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే పలు సందర్భాల్లో 'మహాభారతం' తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా స్వయంగా యస్ యస్ రాజమౌళినే చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఇక తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానుందని ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు రాజమౌళి చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న మెగా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకా నాలుగు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాల్సి ఉంది. ఆ తర్వాతే తన డ్రీమ్ ఫిల్మ్ ను డైరెక్ట్ చేస్తానని తెలిపారు. అయితే ఈ సినిమా సరిగ్గా ఎప్పుడు ప్రారంభం కానుందనేది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: