తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ఎంతోమంది హీరోయిన్స్ చాలా కలలు కంటూ ఉంటారు కానీ వారికి ఇక్కడ పెద్దగా అవకాశాలు రావు ఒకవేళ వచ్చినా కూడా అది తక్కువగానే వస్తూ ఉంటాయి ఈ మధ్య తెలుగు హీరోయిన్స్ కూడా తమ టాలెంట్ తో బాగా అభిమానులను మెప్పిస్తూ ఉన్నారు. అలాంటివారిలో ఈషా రెబ్బ , హీరోయిన్ రీతు వర్మ ఇద్దరు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు రీతు వర్మకి అయితే చాలా మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ ఈమెకు గట్టి షాక్ ఇస్తున్నాయని చెప్పవచ్చు.


ప్రస్తుతం ఆమె శర్వానంద్ నటిస్తున్న ఒకే ఒక జీవితం అనే చిత్రంలో నటిస్తూ ఉన్నది. ఈ సినిమా లో ఈ ముద్దుగుమ్మ ఫిమేల్ లీడ్ లో నటిస్తున్నట్లుగా సమాచారం. శ్రీ కార్తిక్ డైరెక్షన్లు ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతుంది ఈ సినిమాలో అక్కినేని అమలా కూడా నటిస్తూ ఉన్నది టైం ట్రావెల్ కథలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే హీరోయిన్ రీతు వర్మ కు ఇదివరకే ఒక సినిమాలలో నటించిన అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.మరి ఈ ఒకే ఒక జీవితంతో అయినా ఇమే కెరియర్ మారుతుందేమో చూడాలి. శర్వానంద్ కూడా ఈ సినిమా పైన చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్ కి ఇద్దరికీ కూడా కెరియర్ ఉంటుందని చెప్పవచ్చు. లేకపోతే ఇద్దరికి సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయని చెప్పవచ్చు. ఇక రీతు వర్మ, శర్వానంద్ అభిమానులు కూడా చాలా నిరుత్సాహంతోనే ఉన్నారు. మరి ఈ సినిమా సక్సెస్ తో నైనా వీరిద్దరూ సక్సెస్ ట్రాక్ లో పడతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: