ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్ అనే పదానికి నిలువెత్తు రూపం గా మారిపోయింది సుమ. ప్రస్తుతం బుల్లితెరపై కార్యక్రమాల దగ్గర్నుంచి సినిమా ఈవెంట్ ల వరకు కూడా చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది అనే చెప్పాలి. ఎక్కడా వల్గారిటీ లేకుండా తన వాక్చాతుర్యంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో కార్యక్రమాలతో ప్రతి తెలుగింట్లో కూడా సొంత మనిషి లా మారిపోయింది యాంకర్ సుమ. ఇక తన చలాకి మాటలతో అందరినీ కట్టిపడేస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే సుమ భర్త రాజీవ్ కనకాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వరుస అవకాశాలతో బిజీగా గడుపుతున్నాడు రాజీవ్ కనకాల.  సుమ, రాజీవ్ కనకాల ది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి ప్రేమ లో ఏకంగా సినిమాల రేంజ్ లో ట్విస్టులు ఉన్నాయట.  దూరదర్శన్లో ఒక షూటింగ్ జరుగుతున్న సమయంలో రాజీవ్ కనకాల సుమ మధ్య మొదటిసారి పరిచయం ఏర్పడిందట. ఇటీవల ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.

 అయితే మొదటి సారి సుమని చూడగానే ఎంతగానో నచ్చింది. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో షూటింగ్ కోసం వెళ్లాను.. అక్కడ సుమా మరోసారి కనిపించింది. దీంతో తనే నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నాను. దీంతో సుమాను ఎలాగైనా ప్రేమలో పడేయాలని పడరాని పాట్లు పడ్డా. కానీ కుదరలేదు. ఆ తర్వాత మీర్ డైరెక్షన్ లో తెలుగు వారి పెళ్లి అనే సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో పెళ్లికొడుకు గా నటిస్తున్నా. అయితే నా సరసన పెళ్లి కూతురు గెటప్ లో ఒక అమ్మాయి నటించాల్సి ఉంది. అక్కడే అసలు ట్విస్ట్  అనుకోకుండా నా పక్కన సుమని జోడీగా తీసుకువచ్చారు. ఇక అప్పుడే మా మధ్య పరిచయం కాస్త పెరిగింది. ఇక ఆ తర్వాత మేఘమాల సీరియల్ సమయంలో కూడా పరిచయం  స్నేహం గా మారిపోయింది. స్నేహం ప్రేమగా మారింది.  ఇక ఆ తర్వాత పెద్దలను ఒప్పించి 1999లో  పెళ్లి చేసుకున్నాము  అంటూ రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: