టాలీవుడ్ యంగ్ హీరో నందు చాలా కాలంగా స్క్రీన్ పై కనిపించడంలేదు.ఈయన  హీరోగా చిన్న చిన్న సినిమాలు చేసకుంటూ..అప్పడప్పుడు పెద్ద పెద్ద సినిమాల్లో సెకండ్ హీరో పాత్రలు వేస్తూ.. కాస్త ఇమేజ్ సాధించి హీరో.. ఈమధ్య స్క్రీన్ కు అసలే దూరం అయ్యాడు. ఇక నందు ఏమైపోయాడబ్బా అని ఆలోచిస్తున్న ఆడియన్స్ కు రీసెంట్ గా షాక్ ఇచ్చాడు యంగ్ స్టార్.ఈయన హీరోగానే కాకుండా... సింగర్ గీతా మాధురి భర్త గా కూడా ఇమేజ్ ఉంది నందూకి.అయితే  ఎప్పుడో రెండు మూడేళ్ల క్రితం సవారి సినిమాతో కొత్తగా ట్రై చేసిన నందు ఆసినిమా తరువాత అస్సలు కనిపించలేదు. అయితే ఇక  అతను తెరపై కనిపించకపోవడానికి కారణం లేకపోలేదు.

 కాగా తనను తాను మార్చుకోవడం కోసం నందూ చిన్న గ్యాప్ ఇచ్చాడట.ఇకపోతే ఒకప్పుడ కాస్త బొద్దుగా.. ముద్దుగా ఉన్న నందూ.. కంప్లీట్ గా చేంజ్ అయ్యాడు. అయితే అస్సలు పాత్ లుక్ కు కొత్త లుక్ కు ఏమాత్రం పోలిక లేకుండా ఫుల్ గా మేకోవర్ అయ్యాడు నందూ. ఇక నిజంగా ఇతను నందూనేనా అని అనుమానం వచ్చేలా మారిపోయాడీ హీరో.ఇదిలావుంటే ప్రస్తుతం ట్రెండుకు తగ్గట్టు హీరోలంతా సిక్స్ పాక్ ల మీద పడ్డారు. ఇక టోన్డ్ బాడీలతో అంతో ఇంతో ఆడియన్స్ ను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు.అయితే  ఆ కోవలోకే చేరాడు నందు. ఇలానే ఆగిపోతాం అనుకున్నాడో ఏమో.. కప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. అంతే కాదు ఇక  ఆమధ్య రణ్ వీర్ సింగ్ లా.. బోల్డ్ ఫోటో షూట్స్ కూడా చేశాడు.

అయితే  ఎప్పటికప్పుడు తన లుక్స్ ను ఇన్ స్టాలో శేర్ చేస్తూ వస్తున్నాడు నందూ.ఇకపోతే రీసెంట్ గా తన భార్య... ఫేమస్ సింగర్ గీతా మాధురితో కలిసి నందూ ఫోటో షూట్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో శేర్ చేసిన ఈ ఫోటో షూట్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే  ఇక అంతటా ఒకటే టాపిక్ నందూ ఏంటి ఇలా మారిపోయాడు అని. నందూతో కలిసి గీతా మాధురి కూడా వర్కౌట్స్ చేస్తూ.. సన్నబటినట్టు కనిపిస్తోంది.ఈ మేకోవర్ తో వరుసగా అవకాశాలు సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు నందు.ఈ  పోటీ ప్రపంచంలో తనను తాను రెడీ చేసుకున్నాడు. సినిమాలు.. కథల విషయంలో కూడా జాగ్రత్తగా అడుగులు వేయాలని చూస్తున్నాడు.ఇదిలావుంటే ఇక ఇండస్ట్రీలో నందుపై నెగిటీవ్ వైబ్ ఉంది. అయితే నందుకు ఆటీట్యూడ్ ఎక్కువగా అని ఫిల్మ్ సర్కిల్ లో డిస్కర్షన్స్ కూడా జరిగాయి కూడా.  ఆ మచ్చను చెరిపేసుకుని... నందూ మారతాడో లేదో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: