పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. గబ్బర్ సింగ్ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మళ్లీ అంతటి స్థాయిని ఈ చిత్రం అందుకుందని చెప్పవచ్చు. 2013 వ సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది మంచి విజయాన్ని అందుకుంది. ఇక అంతే కాకుండా అత్తారింటికి దారేది సినిమా సెట్ లో లీక్ అయ్యి దీంతో అప్పటికే విడుదల తేదీ సమయాన్ని కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమా లీక్ అవ్వడంతో జనాలు పెద్దగా రారనుకున్నారు అందరూ కానీ ఎవరు ఊహించని విధంగా మొదటి షో నుండి ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం ఇప్పటికీ విడుదలై 9 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సినిమా ఎంతటి కలక్షన్ లో రాబట్టింది ఒకసారి తెలుసుకుందాం.


1). నైజాం-23.25 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-10.46 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-6.22 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-4.7 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-3.38 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-5.25 కోట్ల రూపాయలు
7). కృష్ణ-3.72 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-2.63 కోట్ల రూపాయలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.58.98 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-7.11 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-8.90 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 73.46  కోట్ల రూపాయలు రాబట్టింది.


ఇక ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. రూ 51 కోట్ల రూపాయలతో బరిలోకి దిగగా ఈ చిత్రం ముగిసే సమయానికి రూ.74.99 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. అప్పటివరకు ఉన్న మగధీర పేరును అధికమించి మంచి హిట్ టాకు ను సొంతం చేసుకుంది. ఏది ఏమైనా ఒక సినిమా లీకైన తర్వాత ఇంతటి కలెక్షన్లు రాబట్టడం అంటే కేవలం అది పవన్ కళ్యాణ్ కి సాధ్యమైందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: