టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత చేస్తున్న చిత్రం ఇదే కావడం అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేని క్రాక్ సక్సెస్ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో రెండు వైపులా నుంచి కూడా మార్కెట్ లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి తప్పకుండా ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది అని అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం సినిమా టైటిల్ ఏమిటి అనే విషయంలో అనేక రకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. మొన్నటి వరకు వినిపించిన టాక్ ప్రకారం అయితే ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం.


అంతే కాకుండా అన్నగారు అనే టైటిల్ కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు మూడు టైటిల్స్ పై కూడా దర్శకుడు బాలకృష్ణతో మాట్లాడుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఏదేమైనా కూడా టైటిల్ పై వీలైనంత త్వరగా క్లారిటీ ఇవ్వాలి అని బాలకృష్ణ చిత్ర యూనిట్ సభ్యులతో మాట్లాడినట్లు తెలుస్తోంది.దసరా పండుగ రోజున బాలకృష్ణ 107వ సినిమాకు సంబంధించిన టైటిల్ స్పెషల్ పోస్టర్ను అలాగే టీజర్ ను విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇప్పుడైతే జై బాలయ్య అనే టైటిల్ పైన చిత్ర యూనిట్ సభ్యులు ఎక్కువగా ఫోకస్ చేసినట్లు సమాచారం. మరి అందరూ అనుకున్నట్లు అదే టైటిల్ ఫిక్స్ చేస్తారా లేదంటే మరొక టైటిల్ తో వస్తారా అనేది చూడాలి.ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా ఉంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: