డైమండ్ రత్నంబాబు… రచయితగా ఈయన ఎంతోమందికి తెలుసు. ఎన్నో సినిమాలకు కథలు అందించి ఘనత ఆయనకు ఉంది. ఇక ఆయన రచయిత నుంచి డైరెక్టర్ గా మారిన విషయం విదితమే.
ఆది సాయి కుమార్ తో బుర్ర కథ అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత మంచు మోహన్ బాబు తో సన్నాఫ్ ఇండియా ని ఒక సినిమాను తెరకెక్కించాడు. అప్పట్లో ఈ సినిమా ప్రమోషన్స్ ఒక సంచలనం సృష్టించాయని చెప్పాలి. మోహన్ బాబు కెరీర్ లోనే ఇదో అద్భుతమైన కథ అని, డైమండ్ రత్నంబాబు.. ఇండస్ట్రీకి దొరికిన రత్నం అని చెప్పుకొచ్చారు. తీరా సినిమా చూసాకా అందరి మతులు చెడిపోయాయి. మోహన్ బాబు కెరీర్ లోనే ఈ సినిమాకు ఒక్క టికెట్ కొనుగోలు చేయడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా డైమండ్ రత్నంబాబు ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. సన్నాఫ్ ఇండియా సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా తీసేవాడినని చెప్పుకొచ్చాడు.

“సన్నాఫ్ ఇండియా సినిమా మేకింగ్ చూసి బండ్ల గణేష్ ఎంతో మెచ్చుకున్నాడు. తనవద్ద పవన్ కు సూట్ అయ్యే కథ ఉందని చెప్పగానే చేద్దాం.. అని చెప్పాడు. ఆ సినిమాకు మెకానిక్ అని టైటిల్ కూడా అనుకున్నాను. ఒక మెకానిక్ సమాజంలో ఉన్న సమస్యలను ఎలా రిపేర్ చేశాడు అనేది కథ.. అయితే ఎప్పుడైతే ఈ సినిమా ప్లాప్ అని టాక్ వచ్చిందో అప్పటినుంచి ఫోన్ కూడా ఎత్తడంలేదు. ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకున్న తరువాత మా ఇంటి వాచ్ మెన్ కూడా నా మాట వినలేదు. ఇండస్ట్రీ తీరే అంతా విజయాలు ఉన్నంతసేపు భుజం తడతారు కానీ ఒక్కసారి డిజాస్టర్ టాక్ వచ్చిందంటే కనీసం ముఖం వైపు కూడా చూడరు” అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఈ డైరెక్టర్, బిగ్ బాస్ విన్నర్ సన్నీ, హీరో సప్తగిరిలతో కలిసి అన్ స్టాపబుల్ అనే సినిమా తీస్తున్నాడు. మరి ఈ సినిమా అయినా డైమండ్ రత్నంబాబు తలరాతను మారుస్తుందేమో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: