టాలీవుడ్  టాప్ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపించడంతోపాటు రికార్డులు సృష్టించింది.అంతేకాకుండా ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సాధించింది.ఇక  ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు.  

ఇది ఇలా ఉంటే ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్ కు నామినేట్ కాకపోవడం పట్ల ఇప్పటికే మెగా అభిమానులు నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.అయితే అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ విషయం పట్ల కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయంపై పాన్ ఇండియా హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన స్పందించింది. అయితే ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ఎటువంటి భేదాలు లేకుండా సినిమాను మనమందరం సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇకపోతే గతంలో నేను నటించిన డియర్ కామ్రేడ్ సినిమా కూడా ఆస్కార్ నామినేషన్ కోసం పరిశీలనకు వెళ్ళింది.

 కాకపోతే ఇక ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లలేదు.ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అలా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ సినిమాపై ఉన్న అభిమానాన్ని చూపారు. ఇక ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను దక్కిన అభిమానాన్ని మనమందరం సెలబ్రేట్ చేసుకోవాలి అని రష్మిక మందన తెలిపింది.  తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తప్పకుండా ఆస్కార్ కు వెళ్తుంది అని అనుకోవడంతో పాటు అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుజరాతి చిత్రం అయినా చెల్లో షో సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR