బెల్లంకొండ గణేష్ వర్ష బొల్లమ్మ జంటగా కొత్త దర్శకుడు కే లక్ష్మణ కృష్ణ తెరకెక్కించిన  సినిమా స్వాతిముత్యం  సీతారా ఎంటర్టైర్మెంట్స్ ప్రతాపంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు అన్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.  ఇదే రోజున మెగాస్టార్ గాడ్ ఫాదర్ అక్కినేని నాగార్జున ఘోస్ట్ సినిమాలు విడుదల ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న సినిమా విడుదల వాయిదా వేసుకోలేదు అని చెప్పాలి. ఇక మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను శర వేగంగా నిర్వహిస్తున్నారు చిత్ర బృందం.


 ఇక ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం తెలుస్తుంది. ఇకపోతే స్వాతిముత్యం సినిమాలో తన పాత్ర పై స్పందించిన ఈ ముద్దుగుమ్మ  ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంది. స్వాతిముత్యం సినిమాలో పాత్రలపరంగా చూస్తే నా పాత్ర కొంచెం డామినేట్టింగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. గణేష్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది అంటూ తెలిపింది. నేను భాగ్యలక్ష్మి అనే స్కూల్ టీచర్ పాత్రను పోషించాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక పాత్రకు తగ్గట్టుగానే కాస్త పెత్తనం చూపిస్తూ ఉంటాను. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలు అంటే నాకు ఎంతో ఇష్టం.

 ఇక స్వాతిముత్యం అనే సినిమాలో కొత్తదనం ఉంది. కథ కథనం  ఎంతో ఆసక్తికరంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. ఇక కథ వినకుండానే సితార ఎంటర్టైర్మెంట్స్ సినిమా అనగానే నేను సినిమాకు ఒప్పేసుకున్నాను. ఒక సాధారణ కుటుంబంలో ఎలాంటి సన్నివేశాలు అయితే ఉంటాయో ఇక ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలను చూడవచ్చు. ఈ అమ్మాయి మన పక్కింటి అమ్మాయిలా ఉందని ప్రేక్షకులు అనుకోవడం వల్లే నాకు ఇలాంటి పాత్రలు వస్తున్నాయి అంటూ వర్షా బొల్లమ్మ చెప్పుకొచ్చింది. అయితే నాకు ఫ్యూచర్లో వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంది. ప్రతి నాయక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే మరింత బాగా చేయగలను అన్న నమ్మకం ఉంది అంటూ వర్షబొల్లమ్మ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: