ప్రముఖ బాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా భర్త మరియు కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'మట్టి కుస్తీ. 'ఆర్ టీ టీమ్ వర్క్స్', 'విష్ణు విశాల్ స్టూడియోస్' బ్యానర్లపై మాస్ మహారాజ్ రవితేజతో కలిసి విష్ణు విశాల్,శుభ్రా,ఆర్యన్ రమేష్ లు ఈ సినిమాని చాలా భారీ స్థాయిలో నిర్మించడం జరిగింది.ఇక భార్యా భర్తల మధ్య అనుబంధం అలాగే రెజ్లింగ్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ మూవీ రూపొందడం జరిగింది. డిసెంబర్ 2 వ తేదీన ఈ మూవీ తమిళ్ తో పాటు మలయాళం ఇంకా అలాగే తెలుగు భాషల్లో కూడా ఏకకాలంలో చాలా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేశాడు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. దీంతో తెలుగులో ఈ సినిమా పై ఓ మోస్తారు అంచనాలు ఏర్పడటం జరిగింది. ఇక అందువల్ల మొదటి రోజు సినిమాకి మంచిగా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా చాలా బాగానే నమోదయ్యాయి.


మొత్తంగా వీకెండ్ కు ఓకే అనిపించింది ఈ సినిమా. ఒకసారి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని కనుక గమనిస్తే..'మట్టీ కుస్తీ' సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే ఖచ్చితంగా కూడా రూ.1.9 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ మూవీ ఏకంగా రూ.0.76 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓ పక్క హిట్ 2 సినిమా అయితే మంచిగా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.దీంతో మట్టీ కుస్తీ సినిమా కేవలం లిమిటెడ్ థియేటర్స్ లో కూడా పర్వాలేదు అనిపించేలా కలెక్ట్ చేస్తుంది. కానీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది ఈ సినిమాకి చాలా పెద్దది. ఆ ఫీట్ ను అందుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా రూ.1.14 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కాబట్టి వీక్ డేస్ లో కూడా బాగా రాణిస్తే తప్ప ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ కష్టమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: