తాలీవుడ్ లో సుదీర్ఘ కాలం కొనసాగాలి అంటే కచ్చితంగా మెగా కాంపౌండ్ యొక్క స్నేహం తప్పనిసరి అంటూ చాలా మంది అంటూ ఉంటారు మరీ. మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరోస్ యొక్క మద్దతు ఉంటేనే వారు ఇండస్ట్రీలో కొనసాగ గలరు అనేది కొందరి అభిప్రాయం కూడా అందరి లొ ఉంది.

సీనియర్ నిర్మాత లు కాకుండా కొత్తగా వచ్చిన నిర్మాతలు ఏదో ఒక సమయం లో మెగా హీరో తో సినిమా నిర్మించాలని  తెగ కోరుతూ ఉన్నారు.

సీనియర్ నిర్మాత అయిన దిల్ రాజు ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వం లో ఒక సినిమా ను నిర్మిస్తున్న విషయం  మనకు తెలిసిందే. మరో వైపు దిల్ రాజు మెగాస్టార్ చిరంజీవి తో కూడా ఒక సినిమా ను నిర్మించేందుకు  బాగా ఆసక్తిగా ఉన్నాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా విషయం లో దిల్ రాజు అన్యాయం చేస్తున్నాడని.. ఆ సినిమా కు ఎక్కువ థియేటర్స్ లేకుండా తాను నిర్మిస్తున్న వారసుడు సినిమా కోసం థియేటర్స్ ని బుక్ చేసుకున్నాడు అంటూ ప్రచారం  బాగా జరుగుతుంది.

ఈ సమయం లో దిల్ రాజు పై మెగా కాంపౌండ్ నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని మనకి తెలుస్తుంది చిరంజీవి మొదలుకొని పలువురు మెగా వర్గాల వారు వాల్తేరు వీరయ్య కు మెజార్టీ థియేటర్స్ ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్  కూడా చేస్తున్నారు. తన ఆధీనంలో ఉన్న థియేటర్స్ లో ఎక్కువ శాతం వారసుడు సినిమా కి దిల్ రాజు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని అదే జరిగితే ఖచ్చితంగా మెగాస్టార్ కాంపౌండ్ నుండి దిల్ రాజు కి దూరం అవ్వక తప్పదు అన్నట్లుగా ప్రచారం జోరుగా జరుగుతోంది. దిల్ రాజు నిర్ణయాలు మెగా వ్యతిరేకంగా ఉన్నాయని కొంత మంది  ఇలా గుసగుసలాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: