మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా రవితేజ తన కెరియర్ లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ లలో మిరపకాయ్ సినిమా ఒకటి . హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ , దీక్ష సేథ్ హీరోయిన్లుగా నటించగా , టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . ఈ క్రేజీ మూవీకి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా , నాగబాబు ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. 

మూవీ మంచి అంచనాలు నడుమ 2011 వ సంవత్సరం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా , భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్  దగ్గర అందుకుంది. ఈ మూవీ ద్వారా హీరో రవితేజ కు ... దర్శకుడు హరీష్ శంకర్ కు మంచి గుర్తింపు లభించింది. ఇలా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం రవితేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26 వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొద్ది రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తుంది. 

రవితేజ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన మిరపకాయ్ సినిమా రీ రిలీజ్ కోసం రవితేజ అభిమానులు ఎన్నో రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రవితేజ అభిమానుల కోరిక మరికొన్ని రోజుల్లోనే తీరబోతుంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ రికార్డ్ లను సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: