RRR సినిమాలో చరణ్ ఎన్టీఆర్ ఈ ఇద్దరు హీరోలలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం సులువు కాదనే విషయం తెలిసిందే.

రాజమౌళి సైతం ఈ ప్రశ్న ఎదురైతే సినిమాలో ఇద్దరు హీరోలు కూడా అద్భుతంగా నటించారని చెబుతారు. చరణ్, ఎన్టీఆర్ ఒకే సినిమాలో కలిసి నటించినా ఈ ఇద్దరు హీరోలు నటన విషయంలో ఒకరిపై మరొకరు కామెంట్ చేసుకోరనే విషయం తెలిసిందే.

ప్రముఖ దర్శకులలో ఒకరైన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో దాదాపుగా చరణ్, తారక్ పాత్రలకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చారు.. rrr లో ఎన్టీఆర్ ను కొరడాలతో కొట్టడం లాంటి సీన్లు ఉన్నాయని ఆ సీన్లు అతనికి చాలా ప్లస్ అయ్యాయని ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ తెలిపారు. చరణ్ శంకర్ కాంబో మూవీ శరవేగంగా జరుగుతోందని కూడా తెలిపారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ అంతకంతకూ ఆలస్యమవుతోందని కూడా ఆయన పేర్కొన్నారు.

నాటు నాటు సాంగ్ ను ఎక్కువగా ప్రమోట్ చేయడం జరిగిందని ఆయన కామెంట్లు చేయడం విశేషం.చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ సమానంగానే నటించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కానీ ఫ్యాన్స్ వల్లే ఆస్కార్ లో ఎన్టీఆర్ పేరు ఎక్కువ పేరు వినిపించిందని ఆయన తెలిపారు. గోల్డెన్ గ్లోబ్ లో నాటు నాటు సాంగ్ కు అవార్డ్ రావడంతో ఆ సాంగ్ పై దృష్టి పెట్టి ప్రమోషన్స్ అయితే చేశారని గీతా కృష్ణ కామెంట్లు చేశారు.

ఆర్ఆర్ఆర్ మూవీ అంటే చాలామంది బాలీవుడ్ మూవీ అనుకుంటారని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం విశేషం.చరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్ సమానంగా ఉందని కూడా ఆయన తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావాలని కూడా అభిమానులు కోరుకుంటుండగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మరి చూడాలి. ఈ సినిమా ఆస్కార్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: