టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేక గౌరవం ఉందిమ్ఇదిలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ కుటుంబంలో ఆయన చిన్న కూతురు శ్రీజ వల్ల మరోసారి గొడవలు మొదలయ్యాయి అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తన కుటుంబాన్ని ఎదిరించి తను ప్రేమించిన బ్రాహ్మణ వ్యక్తిని ఇంట్లో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకొని దాని అనంతరం ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ అతనితో విడిపోయి మళ్లీ తండ్రి దగ్గరకు వచ్చేసింది. 

దాని అనంతరం శ్రీజ వంటరి జీవితాన్ని చూడలేక చిరంజీవి తన ఫ్యామిలీ స్నేహితుడు కొడుకు అయిన కళ్యాణ్ ఇచ్చి రెండు వివాహం చేశాడు. వారిద్దరి వివాహ బంధానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించింది. కానీ శ్రీజ మాత్రం ఇప్పుడు రెండవ భర్తతో కూడా కలిసి ఉండడం లేదు. గత కొంతకాలంగా వీరిద్దరూ కూడా విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడం జరిగింది. అంతేకాదు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియాలో పెట్టే కామెంట్లతో ఈ వార్తలు నిజమని చాలా మంది భావించారు. అయితే ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడట.

అదేంటంటే తన చిన్న కూతురు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుందేమోనని తన ఆస్తిలో సగభాగం తన చిన్న కూతురు శ్రీజ కి రాసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలోనే పెద్ద కూతురు సుస్మిత తనకి కూడా తన తండ్రి ఆస్తులలో వాటా కావాలని గొడవ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ క్రమంలోనే తన చిన్న కూతురుకి ఆస్తులు సగభాగం ఇస్తున్నారు కాబట్టి తనకి కూడా సగభాగం ఆస్తిని ఇవ్వాలని తన తండ్రితో గొడవపడి ఆమె ఇంటి నుండి బయటకు వచ్చేసిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సుస్మిత చిరంజీవికి దూరంగా ఒక అద్దె ఇంట్లో ఉంటుందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మొదలైన ఈ గొడవలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: