
అయితే నాగార్జున పట్టించుకుని మరి ప్రత్యేకంగా కొడుకుల కోసం కథలను సెలెక్ట్ చేసిన.. ఆ కథలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయ్. ఎంతో వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు అక్కినేని హీరోలు. మొన్నటికీ మొన్న అఖిల్ భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఏజెంట్ సినిమాతో అట్టర్ ఫ్లాప్ ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇటీవల అఖిల్ అన్న నాగచైతన్య కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. అయితే ఇక అక్కినేని హీరోల కోసం ఇప్పుడు అక్కినేని మాజీ కోడలు సమంత రావాల్సిందినేమో అనే టాక్ వినిపిస్తుంది.
గతంలో సమంత నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన ఏ మాయ చేసావే, మనం, మజిలీ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేయాలని ఎన్నో రోజులుగా తెర వెనుక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పాలి. కానీ వీరిద్దరికి విడాకులు జరగడంతో అది అసాధ్యమని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ వీరిద్దరి కాంబినేషన్స్ సెట్ చేయడానికి ప్రయత్నాలు ప్రస్తుతం మరింత జోరందుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకు అత్యంత సన్నిహితుడైన ఒక ప్రముఖ నిర్మాత కాంబినేషన్ సెట్ చేసే పనిలో ఉన్నాడట. ఇక త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.