అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ వంటి సంచలన సినిమాల తర్వాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రాబోతున్న మరో సినిమా ఎనిమల్.బాలీవుడ్ సుపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా వస్తున్న ఈ సినిమాని ఆగస్టు 11న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ టీజర్ ని కూడా విడుదల చేశారు చిత్ర బృందం. మెయిన్ టీజర్ ని మరొక రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక నిన్న విడుదల చేసిన ఈ ప్రీ టీజర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.ఇక ఈ ప్రీ టీజర్ లో మోస్ట్ వైలెంట్గా రణబీర్ ని చూపించాడు దర్శకుడు. 

కాగా ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోంది. ఇక గతంలో బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రణబీర్ కపూర్ ఇప్పుడు మళ్లీ అనిమల్ సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వబోతున్నాడు. ఇక ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ మరియు మలయాళం భాషల్లో కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో మొదట సందీప్ రెడ్డి సూపర్స్టార్ మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాడట.

కానీ ఈ సినిమాలో వైలెన్స్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో ఈ సినిమా రిజెక్ట్ చేశాడట మహేష్ బాబు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగా కలిసింది సూపర్ స్టార్ మహేష్ బాబు ని మాత్రమే. ఇక ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి అన్నది సందీప్ కోరిక. ఫ్యాన్స్ సైతం ఈ కాంబినేషన్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన ఈ టీజర్ ని చూసిన తర్వాత అయ్యో ఇలాంటి సినిమాని మిస్ చేసుకున్నావా అన్న అంటూ ఫీల్ అవుతున్నారు. భవిష్యత్తులో అయినా వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు రావాలని కోరుకుంటున్నారు మహేష్ ఫ్యాన్స్ ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: