ఇక ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు దీన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మామన్నన్ సినిమాను తెలుగులో నాయకుడు టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలో నటించిన కీర్తి సురేష్, ఫాహద్ ఫాజిల్ లకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఈ సినిమా ఇక్కడ కూడా మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక నాయకుడు తెలుగు ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.
మామన్నన్ అక్కడ హిట్ కాగా తెలుగులో నాయకుడు హిట్ అవుతాడా.. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి. సినిమాలో కీర్తి సురేష్ మరోసారి తన నటనా ప్రతిభతో మెప్పించిందని తెలుస్తుంది. ఉదయనిధి స్టాలిన్ కూడా ఈ సినిమాతో మెప్పించారు. మరి తెలుగులో నాయకుడు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అన్నది చూడాలి. సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ కాబట్టి నాయకుడికి మంచి స్కోప్ దొరికే ఛాన్స్ ఉంది. జూలై 14న బేబీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అయితే నాయకుడు సినిమా ఈ సినిమాకు పోటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి