
ఎట్టకేలకు థియేటర్లో ఈ సినిమా రాబోతున్నది ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్ లో హీరోయిన్ వైష్ణవి క్యారెక్టర్ చుట్టూనే ఈ సినిమా కథ తిరిగేలా కనిపిస్తోంది. స్కూల్ వయసులో ఉన్నప్పుడు కాస్త నల్లగా ఉన్న అమ్మాయిని హీరో ప్రేమిస్తారు అయితే ఆ తర్వాత చదువులు రాణించలేకపోవడంతో ఆనంద్ ఊరిలోనే ఉండిపోతారు కానీ వైష్ణవి మాత్రం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కావడం చేత కాలేజీ కోసం పట్నానికి వెళుతుంది
ఆ తర్వాత అక్కడ లైఫ్ లో సరికొత్త పరిచయాలు సరికొత్త అలవాట్లు క్యారెక్టర్లు అన్ని మారిపోయి కాలేజీలో విరాజ్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత ప్రేమ కథలో మరిన్ని ట్విస్టులు మొదలయ్యే విధంగా ఈ సినిమా ట్రైలర్ కనిపిస్తోంది. ఇలా ఇద్దరి ప్రేమ వల్ల నలిగిపోయి ఒక అమ్మాయిగా వైష్ణవి పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుందని ఈ ట్రైలర్ చూస్తే కనిపిస్తోంది. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా కనిపిస్తోంది. చివరిలో వైష్ణవి చెప్తే డైలాగ్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా ఎమోషనల్ తో కనెక్ట్ అయ్యే విధంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ గా మారుతోంది.