టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మొదట సెప్టెంబర్ 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే ఆ తర్వాత సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించినటువంటి సలార్ మూవీ ని విడుదల వాయిదా చేయడంతో స్కంద మూవీ బృందం వారు ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించింది. దానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇకపోతే ఈ ఈవెంట్ లో భాగంగానే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి బుక్ మై షో అప్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో 100 కే ప్లస్ ఇంట్రెస్ట్ లు లభించాయి. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ కి బుక్ మై షో అప్ లో వస్తున్న రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఈ మూవీ టికెట్ లను ఆన్ లైన్ లో పెట్టినట్లు అయితే మరింత ఎక్కువ రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి కనబడే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: