పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... హరిష్ శంకర్ కాంబినేషన్.లో కొన్ని సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా కంటే ముందు వరుస అపాజయలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయిన పవన్ ఈ మూవీ తో ఆరిదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తిరిగి ఫుల్ ఫామ్ లోకి వచ్చేసాడు.

ఇకపోతే ఇలా గబ్బర్ సింగ్ మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో మరోసారి పవన్ హరీష్ కాంబోలో మరో మూవీ రూపొందుతే చాలా బాగుంటుంది అని ఎంతో మంది పవన్ అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురు చూశారు. ఇక వారి ఎదురు చూపులకు పులిస్టాప్ పెట్టేలా కొంత కాలం క్రితమే వీరి కాంబోలో భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. కాకపోతే కొంతకాలం తర్వాత వీరి సినిమాలో ఆ టైటిల్ తో కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ తో మూవీ రూపొంద పోతున్నట్లు చిత్ర బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

మూవీ లో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో ... రాజకీయ పనులతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న పవన్ తాజాగా ఈ మూవీ షూటింగ్ కు ఈ నెల 26 వ తేదీ నుండి డేట్ లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వేళ రాజకీయ పరిస్థితులను బట్టి షూటింగ్ తేదీ లలో ఏవైనా కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: