మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తాజాగా కింగ్ ఆఫ్ కొత్త అనే మలయాళ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించగా ... రితికా సింగ్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. చివరకు ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. 

అందులో భాగంగా ఈ మూవీ ని సెప్టెంబర్ 29 వ తేదీ నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మలయాళ , కన్నడ , తెలుగు , తమిళ , భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: