అక్కినేని అఖిల్ కొంతకాలం క్రితం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా కెరియర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో మొట్ట మొదటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ యువ నటుడు ఆ తర్వాత టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు.

ఇకపోతే ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ... అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. మలయాళ నటుడు మమ్ముట్టిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించగా ... హిప్ హాప్ తమిజ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా భారీ అంచనాల నడుమ తెలుగు లో కొంత కాలం క్రితం విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత చాలా తక్కువ రోజులకే ఈ సినిమా "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అని వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ విడుదల అయిన చాలా రోజుల వరకు ఈ మూవీ డిజిటల్ ఎంట్రీ కి సంబంధించిన వార్త రాలేదు.

ఎట్టకేలకు తాజాగా ఈ సినిమాని సెప్టెంబర్ 29 వ తేదీ నుండి సోనీ లైవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఈ సంస్థ వారు ప్రకటించారు. ఇకపోతే నిన్న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావాల్సిన ఈ సినిమా అందుబాటులోకి రాలేదు. ఇక తాజాగా సోనీ లీవ్ వారు ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. మరి ఈ సినిమా ఎప్పుడు "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: