
శ్రీదేవి మరణించడానికి కొద్దిరోజుల ముందు ఆమె ఒక గుడికి వెళ్లారట ఇలా కుటుంబ సభ్యులతో పాటు గుడికి వెళ్లినటువంటి ఆమెను గుడి పూజారి చూసి ఆమెకు ఒక హెచ్చరిక జారీ చేశారట. మీకు త్వరలో ఏదో ప్రమాదం రాబోతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పారట. అయితే ఇలాంటి వాటిని అస్సలు నమ్మని శ్రీదేవి పూజారి మాటలు ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే తర్వాత మూడు రోజులకు పూజారి చెప్పిన మాటలు పదే పదే తనకు గుర్తుకు రావడంతో తన మనసు ఏదో తెలియని బరువుగా ఉండేదట. దీంతో ఆమె ఒక నిర్ణయానికి వచ్చారు. ఒకవేళ పూజారి చెప్పినట్టు ఏదైనా ప్రమాదం జరిగి నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించారట. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్నటువంటి శ్రీదేవి తాను మరణించిన తన పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని భావించి తన పేరుపై ఉన్నటువంటి ఆస్తిపాస్తులను తన ఇద్దరి కూతుర్లకు సమానంగా ఇచ్చేసారట. ఇలా తన ఇద్దరి కుమార్తెలకు ఆస్తి పంపకాలు చేపట్టడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యంతో ఎందుకు ఇప్పుడు ఆస్తి పంపకాలు చేస్తున్నారని ప్రశ్నించినప్పటికీ ఏమో ఇవ్వాల్సిన బాధ్యత నాది అంటూ ఆమె అప్పుడు ఆ విషయాన్ని కప్పిపుచ్చుకున్నారు. అయితే ఇలా పూజారి చెప్పినటువంటి నెల రోజులకు సరిగానే ఈమె ప్రమాదవశాత్తు మరణించారు. ఇలా శ్రీదేవి మరణించిన ఆ క్షణం తన తల్లి ఎందుకు ఆస్తి పంపకాలను చేపట్టారు అనే విషయాన్ని గుర్తు చేసుకొని కుటుంబ సభ్యులకు కుమిలిపోయారట. అమ్మ ఆస్తి మాకు ముందుగానే పంచింది అంటే తన మరణం తనకు తెలుసా అంటూ శ్రీదేవి కుటుంబ సభ్యులు ఎంతో కుమిలిపోయారని తెలుస్తోంది.