
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కూడా అభిమానుల్లో మూవీ పై మరింత ఆసక్తిని పెంచింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవల కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు అన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇక ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించారో లేరో ఓటిటి యూట్యూబ్ నుంచి ఒక సినిమాను తొలగించారు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
సలార్ సినిమా స్టోరీ గురించి గత కొంతకాలం నుంచి ఒక వార్త వైరల్ గా మారింది. కన్నడ సూపర్ హిట్ చిత్రం ఉగ్రమ్ కి సలార్ రీమేక్ అని ఒక టాక్ చక్కర్లు కొడుతుంది. అయితే ఉగ్రం సినిమాతోనే ప్రశాంత్ నీల్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. 2014లో వచ్చిన కన్నడలో మాత్రమే రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఇదే కథలో కొన్ని చేంజెస్ చేసి ప్రభాస్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. అయితే మొన్నటి వరకు ఓటిటి మరియు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్న ఈ మూవీ హిందీ వర్షన్ ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో సలార్ ఉగ్రం సినిమాకి రీమేక్ అన్న రూమర్ కి మరింత బలం చేకూరింది అని చెప్పాలి.