టాలీవుడ్ లో అప్పట్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో అతిలోకసుందరి శ్రీదేవి కూడా ఒకరు.. తన అందంతో అభినయంతో ఎన్నో భాషలలో నటించి స్టార్ హీరోల సరసన నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి 2018లో మరణించింది. దుబాయ్ లోని ఒక ప్రముఖ హోటల్లో అనుమానాస్పద స్థితిలో కన్నుమూసిన శ్రీదేవి ఇప్పటికీ కూడా అభిమానుల ఈ విషయం వింటే శోకసముద్రంలోకి మునిగిపోతూ ఉంటారు. శ్రీదేవి భర్త బోణీ కపూర్ పైన చాలామంది అనుమానాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా దుబాయిలో ఉండే పోలీసులు సైతం మరింత అనుమానం పడినట్లుగా తెలుస్తోంది.


అయితే శ్రీదేవి మరణించిన తర్వాత తన భార్య మృతి పైన చాలామంది సృష్టించారు. అయితే ఈ విషయం పైన శ్రీదేవి భర్త ఎప్పుడూ కూడా రియాక్ట్ కాలేదు.. తాజాగా తన భార్యలోని లోటును బాధను సైతం తెలియజేయడం జరిగింది బోణికపూర్. తాజాగా ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ బోణికపూర్ ఇలా మాట్లాడడం జరిగింది. శ్రీదేవి కఠినమైన ఆహారం నియమాలు పాటిస్తుందని ఉప్పు కారం లేని ఆహారాలను తింటూ ఉండేదని అది చాలా తక్కువ మోతాదులలో ఉంటుందట.


ఇలాంటివి తింటూ ఉండడం వల్ల ఆమె చాలాసార్లు ఇంట్లోనే కళ్ళు తిరిగి పడిపోయిందని.. ఎన్నోసార్లు ఆకలితో అలమటించేదని అందంగా కనిపించడం కోసం మంచి ఆకృతితో ఉండడం కోసమే చాలా కష్టపడుతూ ఉండేదని దీంతో  లో బిపి వచ్చిందని తెలిపారు బోణి కపూర్.. ఆహార నియమాలని వదిలేయాలని వైద్యులు సైతం ఎన్నోసార్లు సూచించిన ఆమె వినలేదని తెలియజేశారు. శ్రీదేవి మరణం ఒక యాక్సిడెంట్ గా జరిగిందని తెలియజేశారు. దాదాపుగా 24 గంటలపాటు బోణి కపూర్ను పోలీసులు ప్రశ్నించారని.. ఇండియా మీడియా నుంచి చాలా ఒత్తిడి వచ్చింది కాబట్టి ప్రశ్నించక తప్పలేదని తెలిపారట. లైవ్ డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించారట. ఇలా పూర్తి విచారణ జరిపిన తర్వాతే శ్రీదేవి మరణం  ప్రమాదవశాత్తు జరిగిందని తెలియజేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: