అతిలోకసుందరి శ్రీదేవి మృతిపై తాజాగా ఆమె భర్త బోనీ కపూర్ కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. శ్రీదేవి మరణానికి సంబంధించిన అసలు కారణాన్ని బయటపెట్టారు. దుబాయిలో అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని తెలియజేశారు బోనీకపూర్. శ్రీదేవి సినిమాల కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యేది అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఎండ్ల పాటు ఉప్పు లేకుండా తినేది అని ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయాన్ని లెక్క చేయలేదు అని ఉప్పు లేకుండా తినకూడదని డాక్టర్లు చెప్పినా కూడా శ్రీదేవి దాన్ని అస్సలు పట్టించుకోలేదు అని ఆయన పేర్కొన్నారు.

అందంగా కనిపించాలి అని శ్రీదేవి డైట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేది అని తెలిపారు బోనీకపూర్. ఆమె స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతుంది అనే విషయం పెళ్లయిన తర్వాతే నాకు తెలిసింది అని చెప్పారు. ఉప్పు లేకుండా భోజనం తీసుకునేదని దానివల్ల నీరసించి పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి అని తెలిపారు. శ్రీదేవికి లో బీపీ సమస్యలు కూడా ఉన్నాయని జాగ్రత్తగా ఉండమని డాక్టర్లు చెప్పినా కూడా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది అని అన్నారు. శ్రీదేవిది సహజ మరణం కాదు అని ఆమె ప్రమాదవశాత్తు మరణించింది అని భావించి దుబాయ్ పోలీసులు తనను 24 గంటల పాటు విచారించరు అని ఈ సందర్భంగా వెల్లడించారు.

దానితోపాటు దుబాయ్ పోలీసులు తనకి లైవ్ డిటెక్టర్ పరీక్షల సైతం చేశారు అని తెలిపారు. ఇండియన్ మీడియా నుండి ఒత్తిడి కారణంగా తనను అన్ని విధాలుగా విచారణ చేశారు అని వివరించారు. విచారణ మొత్తం పూర్తయిన తర్వాత శ్రీదేవి మృతిలో ఎలాంటి కుట్రకోణం లేదు అని నిర్ధారించారు అని బయటపెట్టారు బోనీకపూర్. శ్రీదేవి మరణించిన తర్వాత బాలీవుడ్ నటుడు నాగార్జున తనను కలిసారు అని ఈ సందర్భంగా వివరించారు. ఆమె స్ట్రిక్ట్ డైట్ కారణంగా ఒకసారి సెట్లో కూడా స్పృహతప్పి పడిపోయింది అని అన్నారు. ఆ సమయంలో శ్రీదేవి పన్ను కూడా విరిగింది అని నాగార్జున చెప్పినట్లు బోనీ కపూర్ చెప్పారు. 2018లో బంధువుల వివాహం కోసం దుబాయ్ కి వెళ్ళిన శ్రీదేవి ఫిబ్రవరి 24న కన్నుమూశారు. బాత్ టబ్లో జారిపడి చనిపోయినట్లు దుబాయ్ పోలీసులు నిర్ధారించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: