టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో అజయ్ భూపతి ఒకరు. ఈయన కార్తికేయ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా రూపొందిన "ఆర్ ఎక్స్ 100" అనే మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ సక్సెస్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత అజయ్ "మహా సముద్రం" మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇలా ఒక సూపర్ హిట్ ... ఒక ఫ్లాప్ తో కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ దర్శకుడు తాజాగా పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మంగళవారం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 

మూవీ ని నవంబర్ 17 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి అంజనేష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అజయ్ భూపతి , పాయల్ రాజ్ పుత్ కాంబోలో రూపొందిన "ఆర్ ఎక్స్ 100" మూవీ మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో రూపొందుతున్న రెండవ మూవీ కావడంతో మంగళవారం సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: