ఈ వారం విడుదల కాబోయే సినిమాలకు సంబంధించిన సెన్సార్ మరియు రన్ టైమ్ వివరాలను తెలుసుకుందాం.

భగవంత్ కేసరి : బాలకృష్ణ హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ రోజు అనగా అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు /ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 44 నిమిషాల 30 సెకన్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది.

లియో : తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 44 నిమిషాల 27 సెకండ్ల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది.

టైగర్ నాగేశ్వరరావు : మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా రేపు అనగా అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 3 గంటల 1 నిమిషం 39 సెకండ్ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నుపుర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్ లుగా నటించారు.

గణపతి : టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 2 గంటల 16 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: