ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్లు పాత్రల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. పాత్రలో కొత్తదనం ఉండి నటనకు ప్రాధాన్యం ఉంటేనే ఓకే చెబుతున్నారు. కానీ ఇక్కడ ఒక హీరోయిన్ మాత్రం ఒక దర్శకుడు కోసం ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. చివరికి అందరు హీరోయిన్ల లాగా సినిమాలో తన పాత్రని అడివి ఎంత ఉంది అని చూసుకోకుండా.. ఒక్క సెకండ్ పాత్ర వచ్చిన చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఫాతిమా సనా షేక్.
అనురాగ్ బసు తనకు ఒక సెకండ్ పాత్ర ఉన్న ఆఫర్ ఇచ్చిన ఓకే చెప్తాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇద్దరి కలయికతో గతంలో లూడో అనే సినిమా వచ్చింది. మళ్ళీ మెట్రో ఇన్ డీనో అనే చిత్రంలోని నటించబోతుంది. అయితే 2007లో వచ్చిన లైఫ్ ఇన్ ఏ మెట్రో అనే సినిమాకు ఈ మూవీ సీక్వెల్ కావడం గమనార్హం. తన పాత్ర గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను ఈ ప్రాజెక్టు ఒప్పుకోవడానికి ఒకే కారణం.. డైరెక్టర్ అనురాగ్ బసు. ఆయన కోసం ఏమైనా చేస్తాను. సినిమాలోని ఒక్క సెకండ్ పాత్ర అయినా సరే గుడ్డిగా ఒప్పుకుంటా. ఆయన నాకు కథ చెప్పేటప్పుడు నా ఫోన్ కి సిగ్నల్ లేదు. సరిగా ఆయన మాటలు వినపడలేదు. ఆయన వెంటనే సినిమాకు ఒకే చెప్పేసాను. ఎందుకంటే ఆ డైరెక్టర్ పై అంత నమ్మకం అంటూ చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి