టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మహారాజా రవితేజ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈగల్. 'ధమాకా' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రవితేజ చేస్తున్న సినిమా ఇది.ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫర్.. హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుండీ రవితేజ పాత్రను పరిచయం చేస్తూ టైటిల్‌ గ్లింప్స్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి జనాల మంచి స్పందన లభించింది. ఇక ఈరోజు ఈ మూవీ టీజర్ ని కూడా విడుదల చేసింది చిత్ర బృందం.


ఆ టీజర్ విషయానికి వస్తే… మొత్తం 1 నిమిషం 34 సెకన్ల పాటు నిడివి కలిగి ఉంది. టీజర్ చూసినట్లయితే ఎక్కువ శాతం యాక్షన్ సీన్స్ కి , హీరోయిజాన్ని ఎలివేట్ చేసే డైలాగ్లకి పెద్ద పీట వేశారు.వెలుతురు వెళ్లిన ప్రతీ చోట కూడా తన బుల్లెట్ వెళ్తుంది, జనం దృష్టిలో కట్టు కథ, ప్రభుత్వాలు కప్పెట్టేసిన కథ, లావాని వెనక్కి రమ్మని పిలవకు, ఊరూ ఉండదు.. నీ ఉనికీ ఉండదు వంటి డైలాగులు చాలా పవర్ ఫుల్ గా అనిపిస్తాయి.ఈ మూవీలో రవితేజ రెండు రకాల షేడ్స్ కలిగిన పాత్రల్లో కనిపిస్తున్నాడు. ఒక పాత్రలో అయితే నక్సలైట్ ఏమో అన్నట్టు అతని లుక్ ఉంది.ఈగల్ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది. ఇటీవల రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు సినిమా రవితేజ కి ఊహించిన సక్సెస్ ఇవ్వలేదు. మరి ఈ ఈగల్ సినిమా అందిస్తుందేమో చూడాలి. ధమాకా సినిమా తరువాత రవి తేజాకి హిట్టు లేదు. అన్ని ఊహించని రేంజ్ లో భారీ ప్లాపులు పడుతున్నాయి. ఇక వరుస ప్లాపులతో డీలా పడుతున్న రవి తేజాకి ఇప్పుడు ఒక సాలిడ్ హిట్ కావాలి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా రవి తేజాకి ధమాకా రేంజ్ హిట్ ని ఇస్తుందో లేదో..

మరింత సమాచారం తెలుసుకోండి: