టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బీన్నీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆశక రంగనాధ్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ నటి కళ్యాణ్ రామ్ హీరోగా మైత్రి సంస్థ వారు నిర్మించిన అమిగోస్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ ఈ సినిమాతో ఈ నటికి మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే నా సామి రంగ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ తెలుగులో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ లో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే ఉద్దేశంతో ఈ సినిమా షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఐదు పాటల రికార్డింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్ నెల నుండి ఈ మూవీ కి సంబంధించిన ఒక్కో పాటను విడుదల చేస్తూ రాబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మొదట ఈ మూవీ నుండి మెలోడీ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. నాగార్జున ఆఖరిగా ది ఘోస్ట్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి నా సామి రంగా సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: