‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా ‘యానిమల్’. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ మూవీలో కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది.బాలీవుడ్ సీనియర్ హీరోస్ అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు.. ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. డిసెంబర్ 1 వ తేదీన రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దండయాత్ర అయితే మామూలుగా లేదు అనే చెప్పాలి.మొదటి రోజే వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో  రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధిస్తుంది. ఇంకా అంతే కాదు.. నిన్నటితో అంటే 6 వ రోజుకే రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటిదాకా 527.6 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేసింది.ఇప్పటికీ ఈ సినిమా జోరు అస్సలు తగ్గలేదు. ఇంకా హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకుపోతుంది.రణబీర్ కపూర్ కెరీర్లో ఫాస్టస్ట్ రూ.500 కోట్లు మూవీ ఇది అని చెప్పాలి. ఇలాగే వసూళ్లు కంటిన్యూ అయితే రాబోయే రోజుల్లో ఈ మూవీ ఖచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్ లో కూడా చేరే అవకాశం పుష్కలంగా ఉంది . ఇక రణబీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్రం’ ‘యానిమల్’ చిత్రాలతో తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు. రాబోయే రోజుల్లో ఇతని సినిమాలు అన్నీ కూడా తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. యానిమల్ సినిమా తెలుగులో ఏకంగా 50 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇప్పటిదాకా రోబో, ఐ, రోబో 2.0, kgf 2, అవతార్ 2, పఠాన్, జైలర్, జవాన్ ఇంకా ఇప్పుడు యానిమల్ మాత్రమే తెలుగులో ఈ రికార్డుని అందుకున్నాయి. ఇక యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అందరి కన్ను యానిమల్ 2 పైన పడింది. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి దిమిరి బాగా ఫేమస్ అయ్యింది. ఆమెకి వరుస సినిమా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. రవి తేజ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమాలో తృప్తి హీరోయిన్ గా నటించనుందని సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: