చక్కటి అందం ఇంకా అభినయంతో తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ హీరోయిన్ అయ్యి తక్కువ కాలంలోనే పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి. సినిమాలు ఉన్నా లేకున్నా సాయి పల్లవి క్రేజ్ ఇంచు కూడా తగ్గడం లేదంటే తెలుగు ప్రజలు ఆమెను ఎంతలా ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. క్లాస్ సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఎన్నో హృదయాలను ఫిదా చేసేసింది. ఇందులో వరుణ్ తేజ్ కి జోడిగా నటించి సాయి ఎంతో మెప్పించింది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవికి కోట్లు విలువ చేసే ఆఫర్స్ క్యూ కట్టినప్పటికీ.. ఆమె కేవలం పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ గుర్తింపు సంపాదించుకుంది. న్యాచురల్ బ్యూటీగా క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటన ఇంకా డ్యాన్స్ లతో సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక ఫాలోవర్లను సంపాదించుకుంది. తెలుగులో చివరిగా విరాట పర్వం సినిమాలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయినా సాయి పల్లవి మాత్రం పర్వాలేదనిపించుకుంది. ఇక ఆ తర్వాత తమిళంలో హీరో సూర్య నిర్మించిన గార్గి మూవీతో హిట్ అందుకుంది. ఈ మూవీ తెలుగులో డబ్ అయ్యి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఆ సినిమా తర్వాత సాయి పల్లవి మరో లో కనిపించలేదు.


ఇక సంవత్సర కాలంగా సాయి పల్లవి మరో ప్రాజెక్ట్ ప్రకటించకపోవడంతో ఆమె సినిమాలు మానేస్తుందనే ప్రచారం నడిచింది. కానీ కొద్ది రోజుల బ్రేక్ తరువాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కొత్త ప్రాజెక్ట్ ని ఓకే చేసింది. కొన్ని నెలల క్రితం ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు సంవత్సరం తర్వాత తెలుగులో మరో మూవీ చేస్తుంది. ఇక అదే తండెల్. యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మోండేటీ ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే టైటిల్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా..ఈరోజు (డిసెంబర్ 9న) ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు అయిపోయాయి. ఈ వేడుకకు హీరోయిన్ సాయి పల్లవి కూడా హజరయ్యింది.ఎప్పటిలాగే సింపుల్ గా న్యాచురల్ లుక్ లో చుడీదార్ ధరించి మరోసారి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆ తరువాత మీడియాతో మాట్లాడింది. 'రెండేళ్లు అయిపోయింది మీ ముందుకు వచ్చి.. ఇలా మీ అందర్నీ చూస్తుంటే.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఆశీర్వాదం మాకు.. మా కు కావాలి. ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్ ఇంకా వస్తుంటాయి.అప్పుడు ఇంకా మాట్లాడతాను' అంటూ ముగించింది.చాలా కాలం తర్వాత సాయి పల్లవి మీడియా ముందుకు రావడంతో మళ్ళీ ట్రెండింగ్ లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: