టాలీవుడ్ టాప్ హీరోగా సూపర్ స్టార్ డంతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ కోసం ఆయన అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.మహేష్ బాబు చేస్తున్న గుంటూరు కారం మూవీపై అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాని మంచి మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత సూపర్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ హైప్ నెలకొంది. గుంటూరు కారం అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మహేష్ బాబుకు జంటగా శ్రీలీలే నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఈరోజు ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన దమ్ మసాలా పాట అయితే సోషల్ మీడియాను షేక్ చేసింది. యూట్యూబ్ లో ఇప్పటికి కూడా ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఇప్పుడు ఈ మూవీలోని సెకండ్ సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. అయితే ఈ సాంగ్ బ్యూటీఫుల్ మెలోడీ అని తెలుస్తుంది.ఇంకొద్ది సేపట్లో ఈ సాంగ్ ప్రోమో విడుదల కాబోతుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు గుంటూరు కారం మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. గుంటూరు కారం మూవీలో ఓ సాంగ్ లో మహేష్ బాబు ఏకంగా ముగ్గురు హీరోయిన్స్‌తో స్టెప్పులేయనున్నారని సమాచారం తెలుస్తోంది. గుంటూరు కారం లో ఓ స్పెషల్ సాంగ్ లో మహేష్ బాబు శ్రీలీల, మీనాక్షి చౌదరితో పాటు మరో హీరోయిన్ తో కూడా కలిసి డ్యాన్స్ చేయనున్నారని తెలుస్తోంది.ఎస్ ఎస్ తమన్ గుంటూరు కారం కు అదిరిపోయే మ్యూజిక్ అందించాడని తెలుస్తోంది.టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ కు దిమ్మతిరిగే స్టెప్పులు కంపోజ్ చేశారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన అప్డేట్ రానుంది. గుంటూరు కారం సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: