సుహాస్ హీరోగా దుశ్యంత్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు, వెంకటేష్ మహా కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుహాస్ తో శివాజి జంటగా నటించింది. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తే సుహాస్ మరో హిట్ సినిమా తో వస్తున్నాడని అనిపిస్తుంది.

బ్యాండ్ లో పనిచేసే సుహాస్ సెలూన్ కూడా నడిపిస్తుంటాడు. ప్రేమలో పడిన అతను అనుకోని రిస్క్ లో పడతాడు. వాటి నుంచి ఎలా బయట పడ్డాడు అన్నదే సినిమా కథ. చిన్న బడ్జెట్ లో మంచి కంటెంట్ తో సినిమాలు చేస్తున్న సుహాస్ వరుస సక్సెస్ లు అందుకుంటున్నాడు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ తో హిట్లు కొట్టిన సుహాస్ మరోసారి అలాంటి హిట్ టార్గెట్ తో ఈ సినిమా చేశాడు.

ట్రైలర్ చూస్తే సుహాస్ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టడం పక్కా అనేలా ఉంది. సినిమా ట్రైలర్ లో డైలాగ్స్ కూడా ఇంప్రెస్ చేశాయి. మరి సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఫిబ్రవరి 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు. సుహాస్ మాత్రం ఈ సినిమా తో మరో మంచి ప్రయత్నం చేశాడని అనిపిస్తుంది. అందుకే రిజల్ట్ మీద యువ హీరో సూపర్ కన్ ఫిడెంట్ గా ఉన్నాడు. తెలుగు సినిమాల్లో ప్రేమకథలకు ఎప్పుడు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. మరి ఈ అంబాజీపేట మ్యారేజి బ్యాండుకి తెలుగు ఆడియన్స్ ఎలాంటి ఫలితాన్ని అందిస్తారన్నది చూడాలి. సుహాస్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆడియన్స్ ఏమేరకు మెచ్చుకుంటారన్నది మరో రెండు వారాల్లో తెలుస్తుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: