సాధారణంగా సినిమా రంగానికి రావాలని ఇక్కడ మంచి గుర్తింపును సంపాదించుకోవాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే సినిమాల్లో ఛాన్సులు వస్తే తమ కంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక సినిమాల్లో రాణించిన వారు మాత్రం ఎందుకో ఈ రంగుల ప్రపంచానికి గుడ్ బై చెప్పేసి ఇక విదేశాలకు వెళ్లిపోవడం చేస్తూ ఉంటారు. అక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతకడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పటివరకు చాలామంది ఇలా అందరూ కావాలని కోరుకునే.. రంగుల ప్రపంచాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పాలి. అయితే కేవలం ఇక విదేశాలకు వెళ్లి వ్యాపారము ఉద్యోగమో చేసుకొని బ్రతుకుతున్న వారు మాత్రమే కాదు ఏకంగా నటన రంగానికి ఎక్కడ సంబంధం లేని సన్యాసం చేపట్టిన  వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో జైరావాసిం, అను అగర్వాల్ నుండి సనా ఖాన్ వరకు ఇలా ఆధ్యాత్మికతను కొనసాగించడానికి సినీ ప్రపంచాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఇక ఇప్పుడు ఇలా సినీ రంగానికి చెందిన మరో నటి నటనను వదులుకొని బౌద్ధ సన్యాసిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు బుర్కా మదన్. ఒకప్పుడు మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.


 1994లో మిస్ ఇండియా పోటీలలో సుష్మితసేన్, ఐశ్వర్యరాయ్ లకు సైతం గట్టి పోటీని ఇచ్చి మొదటి రనరప్ గా కూడా నిలిచింది. తన అందం అభినయంతో ఎంతగానో పాపులారిటీ సంపాదించుకుంది. అయితే 1996లో బాలీవుడ్లో అక్షయ్ కుమార్, రేఖ, రవిన టాండన్ ప్రధాన పాత్రలో నటించిన  ఖిలాడీ కా కిలాడీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది  ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈమెకు గుర్తింపు వచ్చింది. ఇక 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన బూత్ సినిమాలోను కనిపించింది బుర్కా మదన్. తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇక ఒకానొక సమయంలో నిర్మాతగా కూడా ప్రయోగాలు చేసింది. కానీ ఇప్పుడు ఏకంగా సన్యాసం తీసుకుంది  ఆమె పేరును గార్టెన్ సాంమ్టెన్ గా మార్చుకుంది. ఈ క్రమంలోనే పర్వతాలలో ఓ చోట ధ్యానం చేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో పంచుకుంది ఆమె.

మరింత సమాచారం తెలుసుకోండి: