దర్శకతీరుడు రాజమౌళికి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా సీరియల్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇక ఇప్పుడు దేశం గర్వించదగ్గ డైరెక్టర్ స్థాయికి ఎదిగాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఏదైనా సినిమా వస్తుంది అంటే చాలు భాషతో సంబంధం లేకుండా ప్రాంతంతో పట్టింపు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక సినిమా చూస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా వరల్డ్ వైడ్ హిట్ సాధిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే డైరెక్టర్ రాజమౌళి ఇంతలా సక్సెస్ కావడానికి కారణం సినిమా విషయంలో ఆయనకు ఉన్న ప్యాషన్. ఆయన ఏదైనా సినిమా తెరకెక్కిస్తూ ఉన్నాడు అంటే చాలు సినిమాలోని పాత్రలకు నటీనటులను సెలెక్ట్ చేసే విషయంలో ఎంతో క్లారిటీతో  ఉంటాడు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్లు ఏమనుకుంటారో అని సర్దుకుపోకుండా ఎవరైతే పాత్రకు సెట్ అవుతారో అని.. తన విజన్ కు సరిపోతారు అని అనిపిస్తూ ఉంటుందో వారిని మాత్రమే రాజమౌళి సినిమాల్లోకి తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అందుకే ఏదైనా పాత్రకు వారిని ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడిగితే.. ఏకంగా ఈ సెలక్షన్ వెనుక థియరీ కూడా చెప్పేస్తూ ఉంటారు ఆయన. అయితే తమన్నకు మాత్రం ఈ విషయంపై ఆన్సర్ చెప్పలేదట రాజమౌళి. బాహుబలిలో తమన్నాను అవంతిక పాత్ర కోసం సెలెక్ట్ చేశారు. ఇక మొదటి పార్ట్ లో ఈ పాత్ర ఎంత కీలకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ.. అవంతిక పాత్రకు తనని ఎంపిక చేయడానికి కారణం ఏంటని రాజమౌళిని చాలాసార్లు అడిగినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఎన్నిసార్లు ఈ ప్రశ్న అడిగిన ఎప్పుడు ఆయన నవ్వుతూ వెళ్ళిపోయే వారు తప్ప సమాధానం చెప్పేవారు కాదు అంటూ తమన్న తెలిపింది. అవంతిక పాత్రలో తనలోని నటిని నిరూపించుకునేందుకు మంచి అవకాశం దక్కింది అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: