మెగా పవర్ స్టార్ చరణ్ బర్త్ డే సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యింది జరగండీ సాంగ్. గేమ్ ఛేంజర్ నుంచి ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈపాటకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఫ్యాన్స్ అయితే ఈ పాటని కంపోజ్ చేసిన థమన్ ని బండ బూతులు తిడుతున్నారు. పైగా ఈ సాంగ్ షూటింగ్ కు మాత్రం  కోట్లు ఖర్చు పెట్టారట.ఈ సినిమా అప్డేట్ కోసం రెండేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.కానీ ఈ సాంగ్ దారుణంగా నిరాశ పరిచింది. ఆర్ ఆర్ ఆర్ తరువాత గేమ్ చేంజర్ తో ఈసారి సాలిడ్ గా రావాలని ప్లాన్ చేస్తున్నాడు చరణ్ . సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో పొలిటికల్ నేపథ్యంలో ఈ గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఈ మూవీ కొన్ని కారణాలతో బాగా లేట్ అవుతూ వచ్చింది. జరగండి పాటపై చాలాఎఫెట్ పెట్టారు టీమ్. సాంగ్ కోసం ఏకంగా దాదాపు 18 కోట్లు ఖర్చుపెట్టి చిత్రీకరించామని ఈ సినిమా నిర్మాతలు ప్రకటించారు.అయితే నిర్మాతలు చెప్పినంత గొప్పగా ఈ పాట లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.


ముఖ్యంగా రామ్ చరణ్  అభిమానులు ఈ పాట ఆయన స్థాయికి తగ్గట్టు లేదని కామెంట్స్ చేస్తూ థమన్ ని ట్రోల్ చేస్తున్నారు.ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ద్వారా రామ్ చరణ్ తేజ్ రేంజ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్లిపోయింది. అందుకే ఆయన ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్నారు. అలాంటిది పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో ఇంతటి తక్కువ ప్రమాణాలతో పాట ఉందని తెగ ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను చాలా దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.పాట కాపీ అయినా, ఆకట్టుకునేలా, వినసొంపుగా ఉందా అంటే అస్సలు లేదనే అంటున్నారు నెటిజన్లు.ఈ పాటకి వ్యూస్‌ కూడా తక్కువగానే వచ్చాయి. 24 గంటల్లో ఇది కేవలం ఐదు మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే రాబట్టుకుంది. అది కూడా కేవలం 3 భాషలు మాత్రమే కలిపి రావడం చాలా దారుణం. తెలుగు, తమిళం, హిందీలో ఈ పాటకి కేవలం 5.3 మిలియన్స్ వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. లైక్స్ మూడు లక్షల యాభై వేలు మాత్రమే వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: