సంక్రాంతి పండుగకి హనుమాన్ సినిమాతో వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా.. ప్రస్తుతం మరో యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు మరో సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి.. ఒక యోధుడి గొప్ప సాహసం అంటూ మంచి బజ్ ని కూడా క్రియేట్ చేశారు.ఈ సినిమా టైటిల్ ను గ్లింప్స్ తో అనౌన్స్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. నేడు చెప్పినట్లే రివీల్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో తేజ సూపర్‌ యోధుడిగా కనిపించనున్నారు. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న టైటిల్ మిరాయ్ నే ఈ మూవీకి ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. 2డీ అండ్ 3డీలో రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా టైటిల్ మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం వస్తుంది.


మౌర్య సామ్రాజ్యానికి రాజు అయిన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత పశ్చాతాపంతో యోగిగా మారిపోతాడు. అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఒక అపార గ్రంథం అనేది ఆపదలో ఉంటుంది. ఇక ఆ గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం దుండగులు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు.అయితే దాన్ని కాపాడేందుకు యోధుడు తేజ సజ్జా రంగంలోకి దిగుతాడు. ఆ అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ మూవీ కథగా గ్లింప్స్ ద్వారా అర్ధమవుతోంది.ఇక తాజాగా విడుదల అయిన గ్లింప్స్ లో తేజ సజ్జా స్టైలిష్ మేక్ ఓవర్ తో అద్భుతంగా కనిపిస్తున్నారు. మరో సక్సెస్ ను తేజ అందుకోబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని నెటిజన్లు చెబుతున్నారు. కర్రసాముతో పాటు ఇతర విద్యల్లో కూడా తేజ ట్రైనింగ్ తీసుకున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. తేజ సజ్జాకు ఆ రోల్ పర్ఫెక్ట్ గా సూట్ అయిందని నెటిజన్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: