ఈ మధ్య కాలంలో మలయాళ ఇండస్ట్రీ నుండి చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. తక్కువ బడ్జెట్ తో రూపొందినప్పటికీ సినిమాల్లో చాలా కొత్తదనం ఉండడంతో ప్రేక్షకులు కూడా వాటిని ఎంతగానో ఆదరిస్తున్నారు. దానితో తక్కువ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు కూడా అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం మలయాళం లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో "జయ జయ జయ జయ హే" సినిమా ఒకటి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ లో దర్శన రాజేంద్రన్ , బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలు పోషించగా ... విపిన్ దాస్ ఈ మూవీవని తెరకెక్కించారు.

ఇకపోతే మలయాళ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా ఇప్పటికే తెలుగులో కూడా విడుదల అయ్యింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికే తెలుగులో మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ మూవీ ని మరోసారి టాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ని తెలుగు లో ఎస్ ఒరిజినల్స్ , మూవీ వెర్స్ ఇండియా సంస్థలు గ్రాండ్ గా రీమేక్ చేస్తున్నాయి. ఏ ఆర్ సజీవ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో నటుడు, దర్శకుడైన తరుణ్ భాస్కర్ కీలక పాత్ర చేస్తుండగా ... ఆయనకు జోడీగా యువ నటి ఈషా రెబ్బా నటిస్తోంది.  

ఇక ఈ రోజు ఈషా పుట్టిన రోజు సందర్భంగా షూటింగ్ బ్రేక్ లో ఆమె బర్త్ డే ని గ్రాండ్ గా ఈ మూవీ మేకర్స్ చాలా సెలబ్రేట్ చేసారు. ఈ సందర్భంగా వారు దిగిన కొన్ని  ఫోటోలని తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో మేకర్స్ షేర్ చేసారు. ఇక ఇప్పటికే ఈ సినిమా తెలుగులో విడుదల కావడంతో ఈ మూవీ కథలో అనేక మార్పులు , చేర్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ మూవీ ని ఈ చిత్ర బృందం వారు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: