తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి గా చాలా సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించిన వారి లో స్నేహ ఒకరు. ఈ బ్యూటీ తన కెరీర్ లో ఎక్కువ సినిమాల్లో నటించినప్పటికీ చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే తన అందాలను ప్రదర్శించింది . దానితో ఎక్కువ సినిమాల్లో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రలో నటించడంతో ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియన్స్ లో అభిమానులు ఎక్కువగా ఉన్నారు.

ఈమె కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాలో కూడా నటించింది . ఇతర భాష సినిమాల్లో కూడా ఈమె చాలా తక్కువ శాతం గ్రామర్ తో ఎక్కువ శాతం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది . ఇది ఇలా ఉంటే ఈమె వరుస సినిమా అవకాశాలు వస్తున్న సమయం లోనే తమిళ సినీ నటుడు అయినటు వంటి ప్రసన్న ను 2021 లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరి సంసార జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా స్నేహ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తన భర్త ప్రసన్న గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. స్నేహ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నేను పరిచయం కాకముందు నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడని... కానీ ఆ తర్వాత వారికి బ్రేకప్ అయిందని తెలియజేసింది. ఆ సమయంలో జరిగిన ఆ ప్రేమ వల్ల తనకు ఎలాంటి సమస్య లేదని ... అలాగే వారు విడిపోకపోయి ఉంటే ప్రసన్న తనకు భర్తగా దొరికే వాడు కాదని స్నేహ అన్నారు. ఇక తాజాగా స్నేహ తన భర్త గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: