ప్రముఖ సంగీత దర్శకుడు మరియు నటుడు అయినటువంటి జీవి ప్రకాష్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో తమిళ సినిమాలలో నటించి నటుడుగా మంచి గుర్తింపును సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీలకి సంగీతం అందించి తన అద్భుతమైన సంగీతంతో ఎంతో మంది అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. ఈయన ప్రస్తుతం అనేక తెలుగు సినిమాల కూడా సంగీతం అందిస్తున్నాడు. ఈయన ప్రస్తుతం నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

మూవీ తో పాటు ప్రస్తుతం ఈయన పలు తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నాడు. ఈయన నేరుగా తెలుగు సినిమాల్లో నటించకపోయినప్పటికీ ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వాటి ద్వారా ఈయనకు నటుడిగా కూడా తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈయన తన భార్య అయినటువంటి సైంధవి తో విడిపోయారు. అందుకు సంబంధించిన వార్తలు కూడా వెలువడ్డాయి. ఇకపోతే ఈ వార్తలకు సంబంధించి పలువురు చేస్తున్న కామెంట్లపై జీవి ప్రకాష్ కుమార్ తాజాగా స్పందించాడు.

జీవి ప్రకాష్ కుమార్ తాజాగా స్పందిస్తూ ... సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న కామెంట్లు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఒకటైన , విడిపోయిన పూర్తిగా వాటి గురించి తెలియకుండా మాట్లాడడం ఏ మాత్రం సరికాదు. నేను నా భార్య , సైంధవి విడిపోవడానికి గల కారణాలను మా కుటుంబ సభ్యులకు వివరించాం. ఇది కేవలం ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. దయచేసి మా ఎమోషన్స్ ని అర్థం చేసుకోండి అంటూ జీవి ప్రకాష్ కుమార్ స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: