అయితే సాధారణంగా స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలను చూసి ఇక సేమ్ ఒకే రకమైన సినిమాలు చేస్తున్న ఇద్దరు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ప్రేక్షకుల ఊహకందని రీతిలో క్రేజీ కాంబినేషన్లు రిపీట్ అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా మాస్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండే బాలయ్య, టాలీవుడ్ కి హ్యాండ్సమ్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా రాబోతుందట.
వీరిద్దరూ ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఇదే విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీస్ పై ఇద్దరు హీరోలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.