తెలుగు సినీ పరిశ్రమలో బాక్సింగ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను సాధిస్తే కొన్ని సినిమాలు అపజయాలను అందుకున్నాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాక్సింగ్ నేపద్య సినిమాలు ఏవి .? అందులో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

తమ్ముడు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ ప్రారంభంలో నటించిన ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో రూపొందింది. తన అన్న ఆశయం నెరవేర్చేందుకు తమ్ముడు బాక్సింగ్ లో తన ప్రత్యర్థిని ఏ విధంగా ఎదుర్కొన్నాడు. కామెడీ , సెంటిమెంట్ , లవ్ కలగలిపి బాక్సింగ్ నేపథ్యం ప్రధానంగా ఉండే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ బాక్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది.

లైగర్ : టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్గా నటించగా .. పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. బాక్సింగ్ నేపథ్యంలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయ్యింది.

గని : టాలీవుడ్ యువ నటుడు వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఇక వరుణ్ తేజ్ హీరో గా నటించిన ఈ మూవీ ని బాక్సింగ్ నేపథ్యం లో రూపొందించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా భారీ ఫ్లాప్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: