
ఈ విషయం విన్న అభిమానులు సైతం తెగ ఆనందపడుతూ ఉన్నారు. పుష్ప-2 జోరు చూస్తూ ఉంటే మరో రెండు రోజులలో కచ్చితంగా ఈ సినిమా రూ .1000 కోట్ల క్లబ్లో చేరేలా కనిపిస్తోందని చెప్పవచ్చు.. మరి ఈ సినిమా పూర్తిగా ఎన్ని కోట్ల రూపాయలను రాబడుతుందో చూడాలి మరి. రష్మిక హీరోయిన్గా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది.. ఫహద్ ఫాజిల్, బ్రహ్మాజీ, అనసూయ ,సునీల్ , జగపతిబాబు, రావు రమేష్ తదితర తదితర నటీనటులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటించారు.
పుష్ప సినిమా తో జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. పుష్ప-2 తో కూడా కచ్చితంగా జాతీయ అవార్డు అందుకుంటారని అభిమానులు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్ జాతరలోని నటన చూసి అందరూ ఫిదా అయ్యారు.. మరి ఈసారి కూడా జాతీయ అవార్డు అల్లు అర్జున్ అందుకుంటారో లేదో చూడాలి మరి.. ఇక తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నారు అల్లు అర్జున్.. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో కూడా చేయబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కెరీర్ లోని పుష్ప 2 చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది.