తన కెరీర్ లో ఎంతో మంది దర్శకులతో మహేష్ బాబు సినిమాలు చేశారు. ఇక డైరెక్టర్ రాజమౌళితో ఇంతవరకు ఎలాంటి సినిమాల్లో మహేష్ బాబు నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
అంతేకాకుండా షూటింగ్ సమయంలో ఎవరూ కూడా షూటింగ్స్ స్పాట్ కి ఫోన్లను తీసుకురాకూడదని అగ్రిమెంట్ జరుపుకున్నారట. ఈ అగ్రిమెంట్ ను కాదని ఎవరైనా ఫోన్స్ తీసుకువచ్చిన, సినిమాకు సంబంధించి ఏమైనా సన్నివేశాలను చిత్రీకరించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటారని ఇటీవలే వెల్లడించారు. కాగా ఎస్ఎస్ఎంబి29 సినిమాపై కథ రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు.
ఈ సినిమా పూర్తిగా అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వెల్లడించాడు. మహేష్ బాబు ఇమేజ్, గత సినిమాలను దృష్టిలో పెట్టుకొని సినిమా కథ కాంటెంపరరీలో ఉందా అని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సినిమా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సినిమా ద్వారా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తామని విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఒక హింట్ బయటకు వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి